కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

AKP: పరవాడ మండలం భరణికం గ్రామంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సచివాలయ కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల ఇంఛార్జ్ పంచకర్ల ప్రసాద్, గ్రామ మాజీ సర్పంచ్ బీ. తాతారావు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉంటే వచ్చే నెల 31లోగా సరిదిద్దుకోవాలన్నారు.