23 నెలల కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్
TG: అధికారంలోకి వచ్చి 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలుగా 7 అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఛార్జ్ షీట్‌ను పార్టీ నేతలు రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు చేసిందని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది.