ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

SKLM: జిల్లాలో ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లాలో 11,602 కేసులను గుర్తించగా, పరిష్కారానికి 20 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో నాలుగు బెంచ్‌లు పని చేయనున్నాయన్నారు. సివిల్, క్రిమినల్, కంపౌండబుల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.