VIRAL: ఆరోగ్య కార్యకర్త సాహసం.. అద్భతం

హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలో ఆరోగ్య కార్యకర్త కమలాదేవి సాహసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాగు దాటి, బండరాళ్లపై దూకుతూ హురాంగ్ గ్రామానికి చేరుకుని చిన్నారులకు టీకాలు వేసింది. చిన్నారులకు టీకాలు వేయడానికి ఆమె చేసిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.