VIDEO: ప్రమాదకరంగా మారిన పుష్పాలవాగు బ్రిడ్జి
మెదక్ పట్టణంలోని పుష్పాలవాగు బ్రిడ్జి గత ఏడాది భారీ వర్షాలకు కోతకు గురై ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి వదిలేయడంతో రక్షణ గోడలు లేక వాహనదారులు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అనేక గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం కావడంతో శాశ్వత మరమ్మతులు చేపట్టి, బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.