శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తివేత

NDL: శ్రీశైలం డ్యాం నాలుగో గేటును శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఎత్తారు. నిన్నటి నుంచి మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు స్వల్పంగా వరద పెరగడంతో మరో గేటును ఓపెన్ చేశారు. నాలుగు గేట్ల నుంచి నాగార్జునసాగర్‌కు 1,06,608 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 882.10 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 199.2737 టీఎంసీలుగా ఉంది.