హత్నూర మండలంలో విషాదం ఘటన

హత్నూర మండలంలో విషాదం ఘటన

SRD: గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. దౌల్తాబాద్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే మెయిన్‌ రోడ్డుకు పక్కన కాసాల గ్రామ శివారులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు సుమారు 50–55 సంవత్సరాలుగా అంచనా. పోలీసులు కేస్ నమోదు చేశారు.