VIDEO: అంగరంగ వైభవంగా పోలేరమ్మ బోనాల జాతర

NRPT: నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని పాతపల్లి గ్రామంలో పోలేరమ్మ దేవత బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేక కలశంలో గంగ జలాన్ని తెచ్చి పంచ గంధంతో పూజలు చేశారు. భాజాభజంత్రీలు పోతురాజుల విన్యాసాలు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. బోనాలతో పెద్ద ఎత్తున ఆడపడుచులు తరలివచ్చారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.