ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి: MLA
ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ ప్రజలను కోరారు. బోథ్ మండలంలోని నిగిని గ్రామంలో నెలకొన్న శ్రీ కైలాష్ టేకిడి శివాలయాన్ని స్థానికులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రాంత ఆలయాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.