భువనగిరి ఎంపీ ప్రజా దర్బార్.. టైమింగ్స్ ఇవే..!
భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సోమవారం 'ముఖాముఖి' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పెద్ద అంబర్‌పేట్ క్యాంప్ ఆఫీస్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని MP వ్యక్తిగత సహాయకులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను MP దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.