VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 16వ వార్డులో బుధవారం పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... ఓటు హక్కు చాలా విలువైందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకొని వారు త్వరగా వచ్చి వినియోగించుకోవాలని సూచించారు.