35 మంది అనాథలకు ఆశ్రయం

35 మంది అనాథలకు ఆశ్రయం

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్లపై జీవనం సాగిస్తున్న అనాథలను ఆశ్రమానికి తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెల రోజులుగా సుమారు 35 మంది అనాథలను గుర్తించి వివిధ అనాథాశ్రమాల్లో కల్పించామని చిలకలగూడ ఏసీపీ తెలిపారు.