'జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి'

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణనగర్‌లో యూసుఫ్ గూడ డివిజన్ బూత్ ఇంఛార్జిలు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.