VIDEO: బాజీ హత్య కేసు.. డీఎస్పీ ప్రకటన
PLD: నరసరావుపేట ఎస్ఆర్కటి కాలనీలో జరిగిన బాజీ హత్య కేసుపై డీఎస్పీ హనుమంతరావు సోమవారం మీడియాతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, టీ కొట్టు వద్ద ఉన్న సీసీ కెమెరాల వీడియో ఫుటేజీని పరిశీలిస్తామని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు బాబా పేటకు చెందినవాడిగా గుర్తించామని, త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తామని డీఎస్పీ వెల్లడించారు.