VIDEO: బొజ్జగూడెం తండా గ్రామంలో బావి పూడిక తొలగింపు
SRPT: అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ నీలాబాయి ఆధ్వర్యంలో ఈరోజు కీలక చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామంలో ఉన్న చేతి బావిలో పూడిక తొలగించారు. గ్రామంలో త్రాగునీటి పంపిణీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.