రూ. 9.20 లక్షల చెక్కులు అందజేత

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్హులైన 18 కుటుంబాలకు రూ. 9,20,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోమవారం అందజేశారు. ఆపదలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.