అమలాపురంలో 'ఫిట్ ఇండియా' సైకిల్ ర్యాలీ

అమలాపురంలో 'ఫిట్ ఇండియా' సైకిల్ ర్యాలీ

కోనసీమ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమానికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమలో 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్', 'డ్రగ్స్ వద్దు బ్రో - డ్రగ్స్ రహిత సమాజం మన లక్ష్యం' అనే రెండు కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించారు. SP రాహుల్ మీనా ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సైకిల్ ర్యాలీలో ప్రజలు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.