'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
ELR: ముదినేపల్లి మండలం చేవూరుపాలెంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పైరును వైసీపీ నాయకులు ఇవాళ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు విమర్శించారు. తుది అంచనాలలో నష్టపోయిన విస్తీర్ణం భారీగా తగ్గిందని ఆరోపించారు. కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.