నల్గొండలో మహిళా అదృశ్యం.. కేసు నమోదు

నల్గొండలో మహిళా అదృశ్యం.. కేసు నమోదు

NLG: నల్గొండ పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన గుంజ దీపిక (భర్త: రజనీకాంత్) అక్టోబర్ 9న ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయారు. భర్త ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 'మహిళ అదృశ్యం' కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదులు ఇవాళ తెలిపారు. దీపిక ఆచూకీ తెలిసినవారు ఠాణాలో సంప్రదించాలని కోరారు.