'CMపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే'

'CMపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే'

RR: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు షాద్ నగర్ బీజేపీ యువ నాయకులు ప్రశాంత్ అన్నారు. ఈరోజు వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో సీఎం వంటి ప్రజా ప్రతినిధిపై ఇలాంటి ఘోరమైన దాడులు జరగడం అత్యంత విచారకరమని, సీఎంపై దాడిచేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు. దాడి వెనక ఉన్న అసలు కారణాలను వెలుగులోకి తేవాలన్నారు.