భార్య, పిల్లలను చంపిన భర్త

భార్య, పిల్లలను చంపిన భర్త

RR: ఆమనగల్లు మండలం పులుగొంపల్లి ముస్తూర్ పల్లిలో మంగళవారం దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిరాతకంగా తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.