రేపటి నుంచే భోగనంజుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
CTR: పుంగనూరులోని శ్రీభోగ నంజుండేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ EO రమణ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 14న ఉదయం శనివారం ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, సాయంత్రం కల్యాణోత్సవం, గ్రామోత్సవం ఉంటుందని తెలిపారు.