జిల్లా కలెక్టర్‌ను కలిసిన సబ్ జైళ్ల అధికారి
తిరుపతి జిల్లా సబ్ జైళ్ల అధికారి జి.రవిబాబు (డీఎస్పీ) బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని జైళ్ల నిర్వహణ, భద్రతా వ్యవస్థ బలోపేతం, ఖైదీల సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. జైళ్లలో అమలు చేస్తున్న సదుపాయాలు, సమస్యలు, అవసరాలపై కలెక్టర్‌కు వివరించినట్లు సమాచారం.