అమలాపురంలో వైసీపీ నిరసన ర్యాలీ
కోనసీమ: తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద మహిళలపై అన్యాయంగా జరిగిన దాడిని, వారిపై బనాయించిన తప్పుడు కేసులను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు చేపట్టిన నిరసన ర్యాలీ మాజీ మంత్రి విశ్వరూప్ నివాసం నుంచి ప్రారంభమై అమలాపురం బుద్ధ విహార్ వరకు సాగింది.