గొల్లలపాలెం గ్రామంలో 24×7 పద్దతిలో పోలీస్ పికెట్

విజయనగరం: ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తవలస మండలం, గొల్లలపాలెం గ్రామంలో పోలీస్ పికెట్ అమలు చేశారు. గ్రామంలో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కొత్తవలస సీఐ వి.చంద్రశేఖర్ సిబ్బందితో పోలీస్ పికెట్ను 24×7 షిఫ్ట్‌లు వారీగా నిర్వహిస్తున్నారు. అల్లర్లు తగ్గుముఖం పట్టేవరకు నిరంతరం కొనసాగుతుంది.