రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
TPT: తిరుపతి కలెక్టరేట్‌లో ఈనెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలతో హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరిష్కారం కాకపోయిన ఫిర్యాదులపై 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.