కామేపల్లిలో లారీలు ఢీ .. ఇద్దరికీ గాయాలు
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని కామేపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.