'లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టండి'
NLR: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి NH-67 లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్‌ల నిర్మాణ పనులు చేపట్టాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆయన చాంబర్‌లో ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు.