ఉప్పల్లో మరింత తగ్గిన కోడిగుడ్ల ధరలు..!
MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాలలో కోడిగుడ్ల ధరలు మరింతగా పడిపోయాయి. ప్రస్తుతం 30 కోడిగుడ్ల ట్రే ధర రూ.120 నుంచి రూ.128 మధ్య పలుకుతోంది. డిమాండ్ తగ్గడం, సరఫరా అధికంగా ఉండడం వల్ల ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.