కోదాడ బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ
SRPT: తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఇవ్వాళ కోదాడ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డిపో ఆవరణలో ఆయన మొక్కను నాటారు. అనంతరం బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన ఆయన, అపరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా మరిన్ని బస్సులు పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు.