పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
NTR: వీరులపాడు మండలం జయంతి పరీక్షా కేంద్రానికి పదో తరగతి విద్యార్థులు చేరుకున్నారు. మొట్టమొదటిసారిగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కేంద్రానికి వచ్చారు. పరీక్షలకు ముందు పలువురు తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల భద్రత కోసం పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.