ఢిల్లీకి చేరుకున్న NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా NDA బలపరిచిన C.P రాధాకృష్ణన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రలు కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇవాళ ఆయన పార్టీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 21వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు ఉంది. వచ్చే నెల 9న ఎన్నిక జరగనుంది.