వరంగల్‌లో వరదలపై సహాయక చర్యల మాక్ డ్రిల్

వరంగల్‌లో వరదలపై సహాయక చర్యల మాక్ డ్రిల్

WGL: జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో వరదల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద జరిగిన ఈ డ్రిల్‌ను జిల్లా విపత్తు అధికారులు సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా పాల్గొని పరిశీలించారు. పోలీస్, ఆరోగ్య, ఫైర్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.