'ఈనెల 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవం'
PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6 నుంచి 11 వరకు జిల్లాలో ఆరోగ్య వారోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రోజువారీగా ఫుడ్ రిజిస్ట్రేషన్ మేలా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య శిబిరాలు, ఎయిడ్స్ అవగాహన, యోగా ప్రదర్శనలు, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.