రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.