గుడ్లూరులో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ప్రారంభం
NLR: గుడ్లూరులో రైతుల సంక్షేమం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు. నీటి భద్రత, పంటల ప్రణాళిక, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం అనే పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని MAO రవికుమార్ తెలిపారు. ఈనెల 25 వరకు వారోత్సవాలు కొనసాగుతాయని MPDO వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.