'సైన్స్ టాలెంట్ టెస్టులతో శాస్త్రీయ వైఖరులు'
SRPT: చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లతో విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తాయని ఎంఈవో సైదా నాయక్ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్ మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షా పత్రాలను ఆయన విడుదల చేశారు. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సభ్యులు పాల్గొన్నారు.