పర్సాపూర్‌లో ఘనంగా రక్షాబంధన్

NRPT: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మద్దూరు మండలంలోని పర్సాపూర్ గ్రామంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబంలో అందరూ ఒకే చోట చేరి రాఖీలు కట్టుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిర్వహించుకునే రాఖీ పండుగకు సోలాపూర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చి రాఖీలు కట్టి ప్రేమానురాగాలను పంచుకున్నారు.