కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన: ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన: ఎమ్మెల్యే

సూర్యాపేట: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే మందుల సామేలు చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం గొప్ప వరం లాంటిదని అన్నారు. అనంతరం అర్వపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అదనపు తరగతుల శంకుస్థాపన చేశారు.