గౌరీ పరమేశ్వరుల ఉత్సవం ఈనెల 27కు వాయిదా
AKP: అనకాపల్లి కుంచా గౌరీ పరమేశ్వరుల ఉత్సవం ఈనెల 27వ తేదీకి వాయిదా పడినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎం వీరభద్రరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన జరగాల్సిన ఉత్సవం అనువార్య కారణాలవల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. ఉత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు భక్తులందరూ సహకరించాలని కోరారు.