కల్యాణ మండపానికి భూమి పూజ చేసిన ఎంపీ
కర్నూలులో ఎంపీ నాగరాజు తన సొంత గ్రామమైన పంచలింగాలలోని పాండురంగ స్వామి ఆలయంలో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.