VIDEO: కాంగ్రెస్ పార్టీ నాయకుడి ముందస్తు అరెస్ట్
MBNR: జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. నవాబుపేట మండలానికి చెందిన పార్టీ నాయకుడు భాస్కర్ ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో సమావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమవ్వగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.