Airtel నెట్‌వర్క్ డౌన్

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇవాళ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ డౌన్ అయ్యింది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ సమస్య మొదలు కాగా.. 4:32 గంటల వరకు 3,600కు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు, HYD, గుజరాత్, చెన్నై, నాసిక్‌లో సమస్యలు నమోదయ్యాయి. దీనిపై ఎయిర్‌టెల్ స్పందించింది. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటన విడుదల చేశారు.