చలి ఎక్కువగా అనిపిస్తుందా?
శరీరంలో కొన్ని పోషకాలు లేకపోవడం వల్ల ఇతరుల కన్నా ఎక్కువ చలిగా అనిపిస్తుందని వైద్యనిపుణలు చెబుతున్నారు. ఐరన్, బి12 విటమిన్ తగ్గితే.. ఇతరుల కన్నా మనకు చలి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. శరీర ఉష్ణోగ్రత నిర్వహణ ప్రధానంగా రక్త ప్రసరణ, ఎర్ర రక్త కణాలపై ఆధారపడి ఉంటుందట. అందుకే మంచి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులను వాడలంటున్నారు.