రఘురాంను కలిసిన తిరుమలగిరి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్
కృష్ణా: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలగిరి 'శ్రీ నామాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం' ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులైన వెంకటేష్ యాదవ్, డైరెక్టర్లు KDCCB ఛైర్మన్ రఘురాంను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతతో, భక్తులకు సేవా భావంతో ముందుకు సాగాలని రఘురాం సూచించారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.