సరూర్నగర్ PSలో అక్బరుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు
RR: అక్బరుద్దీన్ ఒవైసీపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన ప్రకటనపై కొంతమంది వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తూ తనను బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులకు సంబంధించి సుమారు 10 మంది ఫోన్ నంబర్ల వివరాలను పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. తనను డిస్టర్బ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.