వెలుగులోకి అరుదైన 12 వ శతాబ్దపు శిల్పాలు
NRML: దిలావర్పూర్ మండలం టెంబరేణి గ్రామంలో 12వ శతాబ్దానికి చెందిన ఉగ్రనరసింహ,సరస్వతి,నృత్య గణపతి వంటి శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం శివకేశవ ఏకత్వాన్ని ప్రతిబింబిస్తోందని చరిత్రకారుడు డా. తుమ్మల దేవరావ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. SRSP ముంపు కారణంగా ఆలయం ధ్వంసమైందని, పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.