పండగను శాంతియుతంగా జరుపుకోండి: ఎస్పీ

MBNR: వినాయక చవితి పండగను అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించి, సామాజిక సమన్వయం, పరిశుభ్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, పోలీసు సిబ్బంది పండగ సమయంలో నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.