సైదాబాద్‌లో అగ్నిప్రమాదం

సైదాబాద్‌లో అగ్నిప్రమాదం

HYD: సైదాబాద్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్బీఐ కాలనీలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.