'భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం'

SKLM: భగీరథ మహర్షి పట్టుదలతో దివి నుంచి భువికి లోకకళ్యాణం కోసం గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు కొనియాడారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను నెమరు వేసుకున్నారు.